https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/25/harbhajan-singh_0.jpg?itok=QTXis6KD

నన్ను వృద్ధుడిని చేసేశారు: భజ్జీ



న్యూఢిల్లీ:  భారత క్రికెట్‌లో మూడు పదుల వయసులోనే అతని కెరీర్‌కు సెలక్టర్లు చరమగీతం పాడతారని ఇటీవల మాజీ పేసర్‌ ఇర్ఫాన్‌ పఠాన్‌ విమర్శలు చేయగా, ఇప్పుడు హర్భజన్‌ సింగ్‌ సైతం దాదాపు అవే వ్యాఖ్యల్ని చేశాడు. ఒకానొక దశలో టీమిండియాలో కీలక స్సిన్నర్‌గా ఉన్న హర్భజన్‌.. చాలాకాలంగా కనీసం జట్టు ఎంపికలో కనీసం పరిశీలనలోకి కూడా రావడం లేదు. ఇదే విషయాన్ని భజ్జీ ప్రస్తావించాడు. (‘ఎంఎస్‌ ధోనిని ఫాలో అవుతా’)

‘ నన్ను కనీసం పరిగణలోకి తీసుకోవడం లేదు. నేను సిద్ధంగా ఉన్నా పరిశీలించడం లేదు. నేను ఐపీఎల్‌ ఇంకా ఆడుతున్నా. ఐపీఎల్‌ బౌలింగ్‌ చేసేటప్పుడు భారత జట్టుకు బౌలింగ్‌ చేయలేనా. ఐపీఎల్‌లో బౌలింగ్‌ చేయడమే చాలా కష్టం. బౌలర్లకు ఐపీఎల్‌ అనేది క్లిష్టమైనది. వరల్డ్‌లో ఉన్న టాప్‌ ప్లేయర్స్‌ అంతా ఇక్కడ ఆడుతారు. నేను ఐపీఎల్‌ ఆడుతున్నాననే విషయం సెలక్టర్లు మరిచిపోయినట్లు ఉన్నారు. సెలక్టర్ల నన్ను వృద్ధుడిని చేసినట్లే కనిపిస్తోంది.  నేను చాలాకాలంగా ఎటువంటి దేశవాళీ క్రికెట్‌ ఆడటం లేదు. కానీ ఐపీఎల్‌లో బాగానే రాణిస్తున్నాను. గత నాలుగేళ్లుగా సెలక్టర్లు అసలు పట్టించుకోవడం మానేశారు. నేనే ఏమిటో నా బౌలింగ్‌ గణాంకాలే చెబుతాయి. భారత జట్టులో రీఎంట్రీపై ఇంకా ఆశలు కోల్పోలేదు’ అని భజ్జీ తెలిపాడు. (తొందరెందుకు.. కాస్త ఆగి చూడండి: మిస్బా)