https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/25/cv.jpg?itok=2TO4AV4a

ఏపీలో మరో 44 కరోనా కేసులు

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్తగా 44 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్రంలో కరోనా బారిన పడిన వారి సంఖ్య 2,671కి చేరింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ సోమవారం హెల్త్‌ బులిటెన్‌ను విడుదల చేసింది. గత 24 గంటల్లో 10,240 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 44 మందికి కరోనా పాజిటివ్‌ నిర్ధారణ అయిందని తెలిపింది. చదవండి: కరోనా వైరస్‌ మన శరీరంలోకి వెళ్లాక ఏం చేస్తుంది? 

రాష్ట్రంలో కొత్తగా నమోదైన కేసుల్లో చిత్తూరులో 5, నెల్లూరులో 2 మొత్తంగా ఏడుగురు కోయంబేడు (తమిళనాడు) నుంచి వచ్చిన వలస కార్మికుల్లో నమోదయ్యాయి. ఈ రోజు ఒక్కరోజే 41 మంది కోలుకుని ఇళ్లకు వెళ్లిపోయారని, ఎటువంటి మరణాలు నమోదు కాలేదని పేర్కొంది. కాగా, ఇ‍ప్పటి వరకు 1,848 మంది వైరస్‌ బారినుంచి కోలుకుని డిశ్చార్జ్‌ అయ్యారు. ప్రస్తుతం 767మంది ఆసుపత్రుల్లో చికిత్స పొందుతుండగా మొత్తం 56మంది మరణించారు. చదవండి: గాడ్సే దేశాన్ని రక్షించారంటూ ఎఫ్‌బీలో పోస్ట్‌