గుంటూరు జిల్లాలో విషాదం..
సాక్షి, గుంటూరు: జిల్లాలోని బాపట్ల మండలం మరుప్రోలువారిపాలెంలో విషాదం చోటు చేసుకుంది. పురుగుల మందు తాగి ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. కుమార్తెతో సహా దంపతులు ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను వీరాస్వామిరెడ్డి, రమణ, పోలేరుగా గుర్తించారు. పొలంలో మోటార్లు చోరి చేశారంటూ కేసు పెట్టడంతో అవమానంతో ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకున్నట్లుగా తెలిసింది. ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారిస్తున్నారు.