https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/25/nithin.jpg?itok=lLDvNS8X

ఎన్ని రోజులు సింగిల్‌గా ఉంటావో నేనూ చూస్తా: నితిన్‌

మెగా ఫ్యామిలీ నుంచి వచ్చినా. తనకంటూ ప్రత్యేక గుర్తింపు కోసం ప్రయత్నిస్తున్న హీరో ‘సాయిధరమ్‌ తేజ్’‌. ప్రస్తుతం తేజ్‌ హీరోగా నటిస్తున్న సినిమా ‘సోలో బ్రతుకే సో బెటర్’‌. థమన్‌ మ్యూజిక్‌ అందిస్తున్న ఈ సినిమాలో నభా నటేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్నారు. సుబ్బు అనే కొత్త దర్శకుడు తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో పెళ్లి అంటే ఆమడ దూరం పారిపోయే వ్యక్తి పాత్రలో సాయి ధరమ్‌ తేజ్‌ కనిపించనున్నాడు. ఇక ఈ సినిమాకు చెందిన ఓ పాటను హీరో నితిన్‌ రిలీజ్‌ చేశారు. ‘నో పెళ్లి, దాని తల్లి.. ఈ తప్పే చేయకురా వెళ్లి’ అంటూ సాగే ఈ పాటలో మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ అతిథి పాత్రలో కనిపించనున్నాడు. సాయికి తోడుగా వరుణ్‌ సైతం పాటలో రాగం అందించాడు. (‘ ఆ విషయంలో దీపిక చాలా క్రూరం’)

ఈ సందర్భంగా నితిన్‌ ట్వీట్‌ చేశారు. సినిమా నుంచి సాంగ్‌ను విడుదల చేయడం సంతోషంగా ఉందని అన్నారు. అయితే పెళ్లి చేసుకోకుండా ఎన్ని రోజులు ఉంటావో నేను చూస్తానని సాయిని ఉద్ధేశించి సరదా వ్యాఖ్యలు చేశారు. కొన్ని సార్లు చేసుకోవడంలో టైమ్‌ గ్యాప్‌ ఉంటుందేమోగానీ చేసుకోవడం మాత్రం పక్కా అంటూ ఫన్నీ కామెంట్‌ పెట్టాడు. ఇక దీనిపై వెంటనే సాయి ధరమ్‌ తేజ్‌ స్పందించి.. నేను ట్రెండ్‌ ఫాలో అవ్వను బ్రదర్‌, ట్రెండ్‌ సెట్‌ చేస్తా అంటూ బదులిచ్చారు. ‘మింగిల్‌ అయినా మా లాంటి సింగిల్స్‌ కోసం ఈ సాంగ్‌ లాంచ్‌ చేసినందుకు థ్యాంక్యూ డార్లింగ్‌’. అని రీట్వీట్‌ చేశాడు. (ఏంటి బావ పెళ్లంట.. వాళ్లు మోసం చేశారు!)