ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు: మోదీ
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ఉన్న ముస్లిం సోదరులకు ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కరోనా నేపథ్యంలో ప్రజలు సామాజిక దూరాన్ని పాటిస్తూ పండగ చేసుకోవాలని ఆయన కోరారు. ‘ఈద్ ఉల్ పితర్ సందర్భంగా ఈద్ ముబారక్. ఈ పర్వదినం కరుణ, సోదర భావాన్ని, సామరస్యాన్ని మరింత పెంచుతుందని ఆశిసస్తున్నాను. ప్రతి ఒక్కరు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను’ అంటూ మోదీ ట్వీట్ చేశారు.
కరోనా కారణంగా ప్రజలు సామాజిక దూరం, లాక్‌డౌన్ నిబంధనలు పాటిస్తూ రంజాన్ పండుగను జరుపుకోవాలని ఢిల్లీకి చెందిన ముస్లిం మత పెద్దలు ప్రజలను కోరారు. కరోనా సంక్షోభ సమయంలో ముస్లిం సోదరులు పండగను నిరాడంబరంగా జరుపుకోవాలని.. పేద ప్రజలకు, ఇరుగపొరుగు వారికి సహాయం చేయాలని జామా మసీదు షాహి ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ విజ్ఞప్తి చేశారు. రంజాన్ సందర్భంగా ప్రతి ఏడాది ముసస్లిం సోదరులతో కిక్కిరిసి ఉండే జామా మసీదు లాక్‌డౌన్ కారణంగా ఈ ఏడాది బోసి పోయింది.