https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/25/366.jpg?itok=ROHfQ0BM

ఒక్క రోజులో 6,977 కరోనా కేసులు

న్యూఢిల్లీ : భారత్‌లో కరోనా వైరస్‌ విజృంభణ కొనసాగుతోంది. దేశవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య రోజురోజుకి పెరగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో 6,977 కరోనా కేసులు నమోదు కాగా, 154 మంది మృతిచెందారు. ఇప్పటివరకు ఒక్కరోజులో నమోదైన కేసుల్లో ఇదే గరిష్టం కావడం గమనార్హం. దీంతో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,38,845కి చేరింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం ఉదయం హెల్త్‌ బులిటెన్‌ విడుదల చేసింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 57,720 మంది కరోనా నుంచి కోలుకోగా.. 4,021 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశంలో 77,103 కరోనా యాక్టివ్‌ కేసులు ఉన్నాయి. (చదవండి : 90శాతం కేసులు 10 రాష్ట్రాల్లోనే..!)

మరోవైపు కరోనా ప్రభావం అధికంగా ఉన్న మహారాష్ట్రలో కేసుల సంఖ్య 50 వేలు దాటింది. అక్కడ ఇప్పటివరకు 50,231 కరోనా కేసులు నమోదు కాగా,  14,600 మంది కోలుకున్నారు. 1,635 మంది మృతిచెందారు. ఆ తర్వాత తమిళనాడులో 16,277, గుజరాత్‌లో 14,056, ఢిల్లీలో 13, 418 కరోనా కేసులు నమోదయ్యాయి.