https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/25/vsr.jpg?itok=lozG51gc

పప్పూ.. నాన్న మీద అలిగావా?

సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు, ఆయన కుమారుడు లోకేష్‌పై వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ రాజ్యసభ ఎంపీ విజయసాయి రెడ్డి మరోసారి ట్విటర్‌ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఈ మేరకు తన ట్విటర్‌ ఖాతాలో.. 'బిల్‌గేట్స్‌ని తీసుకొచ్చానన్నావ్‌.. బిల్‌ క్లింటన్‌ని తీసుకొచ్చానన్నావ్‌.. టోని బ్లెయిర్‌ని తీసుకొచ్చానన్నావ్‌.. ఇంతకీ పప్పుని తీసుకొచ్చావా, లేదా' అంటూ ట్వీట్‌ చేశారు.

కాగా మరో ట్వీట్‌లో 'పప్పూ...తప్పు..! నాన్న మీద అలిగేవా? పార్టీ అధ్యక్ష పదవి ఇస్తే తప్ప మందలగిరి రానన్నావా? పప్పూ... తప్పు తప్పు..! అంటూ' విజయసాయి రెడ్డి మరో ట్వీట్‌‌లో వ్యంగ్యాస్త్రాలు సంధించారు. చదవండి: 'ఆయన హయాంలో తట్ట మట్టి కూడా తీయలేదు'

‘యూటర్న్‌ అంకుల్‌.. ఏమిటి చెప్పండి’