‘ఆయన ఆచూకీ చెబితే రూ.5,100 బహుమతి’
భోపాల్: మా నాయకుడు జ్యోతిరాధిత్య సింధియా ఆచూకీ చెబితే రూ.5,100 బహుమతి ఇస్తామంటున్నారు గ్వాలియర్ జనాలు. ఈ మేరకు ఆయన కనిపించడం లేదంటూ వీధుల వెంట పోస్టర్లు అంటించారు కాంగ్రెస్ కార్యకర్తలు. ఈ ఏడాది మార్చిలో జ్యోతిరాధిత్య కాంగ్రెస్ పార్టీకి రాజీనామ చేసి బీజేపీలో చేరిన సంగతి తెలిసిందే. ఆయనతో పాటు మరో 22 మంది కాంగ్రెస్ ఎమ్మెల్యేలు బీజేపీలో చేరారు.