మాడిపోతున్న పసిమొగ్గలు
బాల్యం విలవిల్లాడుతోంది..ఆటపాటల్లేవని ఆందోళన చెందుతోంది..కరోనా దెబ్బకు కన్నీరు పెడుతోంది..అమ్మానాన్నలతో ఆడుతూ.. పాడుతూ ఉండాల్సిన ఆ పసిపిల్లలు ఎండకు మాడిపోతున్నారు..ఆకలితో అల్లాడుతున్నారు. అమ్మానాన్నలకు చేసేందుకు పనిలేదు.. చేతిలో చిల్లిగవ్వలేదు..లాక్‌డౌన్ పంజాకు జీవితం కకావికలమైంది..
సొంతూరికి వెళితే కనీసం పిల్లలకైనా కడుపునిండాతిండిపెట్టొచ్చనే ఆశతో వేలాదిమంది వలస కూలీలు స్వస్థలాలబాటపట్టారు. మధ్య మధ్యలో మానవతామూర్తులు ఇచ్చే ఆహారంతో కడుపునింపుకుంటున్నారు.(మేడ్చల్ అవుటర్ రింగ్ రోడ్డు వద్ద స్వస్థలాలకు వెళుతున్న వలస కూలీలకు ఆదివారం పలువురు ఆహారం, డబ్బు పంపిణీ చేశారు.ఆ సందర్భంగా తీసిన చిత్రాలివి.)