
ముక్క కోసం !
అనంతపురం: కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో రద్దీని నివారించడం కోసం అనంతపురం నగరంలో ఆదివారం చికెన్ , మటన్ దుకాణాలను మూసివేయాలని అధికారులు ఆదేశాలు జారీ చేశారు. ఎక్కడా ముక్కలు దొరకకపోవడంతో మాంసంప్రియులు పల్లెబాట పట్టారు. ద్విచక్ర వాహనాల్లో చుట్టుపక్కల ఉన్న గ్రామాలకు వెళ్లి కొనుగోలు చేశారు. ఇందులో భాగంగానే గార్లదిన్నె సమీపంలోని పంట పొలాల్లో మటన్ కోసం ప్రజలు బారులు తీరారు.
– సాక్షిఫొటోగ్రాఫర్
