https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/25/tpt.jpg?itok=P558ZyGI

తోటి కోడళ్ల వివాదం.. గ్రామాల మధ్య ఘర్షణ



చిత్తూరు, కేవీపల్లె : మండలంలోని నక్కలదిన్నెవడ్డిపల్లెలో రెండు కుటుంబాల వివాదం గ్రామాల మధ్య ఘర్షణకు దారితీసింది. గ్రామానికి చెందిన ఎ.అంజి భార్య నిర్మల, ఏ.రాము భార్య చామంతి శనివారం తాగునీటి విషయమై గొడవపడ్డారు. ఈ విషయం తెలుసుకున్న దిన్నెవడ్డిపల్లెకు చెందిన నిర్మల బంధువులు నక్కలదిన్నెవడ్డిపల్లెకు చేరుకుని చామంతి కుటుంబంతో వాగ్వాదానికి దిగారు. ఈ వివాదం ముదిరి ఆదివారం తెల్లవారుజామున రెండు గ్రామాల ప్రజలు వర్గాలుగా విడిపోయి దాడులు చేసుకున్నారు. ఓ వర్గానికి చెందిన బైకుకు నిప్పుపెట్టారు. మరో రెండు కార్లు, బైకును ధ్వంసం చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామానికి చేరుకుని ఇరువర్గాలకు సర్దిచెప్పారు. మదనపల్లె డీఎస్పీ రవిమనోహరాచారి నక్కలదిన్నెవడ్డిపల్లెకు చేరుకుని సీఐ మురళీకృష్ణ, ఎస్‌ఐ రామ్మోహన్‌ ఆధ్వర్యంలో పోలీస్‌ పికెట్‌ ఏర్పాటు చేశారు. ఇరువర్గాల ఫిర్యాదు మేరకు 31 మందిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.