https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/05/25/PIA.jpg?itok=zjAMg6oZ

కరాచీ విమాన ప్రమాదంపై కొత్త అనుమానాలు

కరాచీ: పాకిస్తాన్‌లో విమానం కూలి 97 మంది మరణించిన ఘటనపై జరిగిన ప్రాథమిక విచారణలో అనేక విషయాలు వెలుగుచూస్తున్నాయి. విమానం మొదటిసారి ల్యాండింగ్‌ ప్రయత్నం చేయగా అది విఫలమైంది. ఆ విషయాన్ని పైలట్లు ఎయిర్‌ ట్రాఫిక్‌ కంట్రోలర్‌కు చెప్పలేదు. ల్యాండింగ్‌ ప్రయత్నంలో విఫలమైతే జరిగిన ప్రమాదం వల్ల ఇంజిన్లు, ఇతర విభాగాలు దెబ్బ తిని ఉండవచ్చని.. ఇలా జరిగితే వెంటనే ఎమర్జెన్సీ అలారం యాక్టివేట్‌ అవుతుందని నిపుణులు చెబుతున్నారు. కానీ, ఆ విమానంలో ఆ అలారం యాక్టివేట్‌ కాలేదు. ల్యాండిగ్‌ విఫలమైనపుడు 3,000 అడుగుల ఎత్తుకు తీసుకెళ్లాల్సిందిగా ట్రాఫిక్‌ కంట్రోలర్‌ చెప్పినా పైలట్లు 1,800 అడుగుల ఎత్తు వరకు మాత్రమే విమానాన్ని తీసుకెళ్లగలిగారు. విమానంలోని బ్లాక్‌ బాక్సును అధికారులు స్వాధీనం చేసుకున్నారు.