https://www.prabhanews.com/wp-content/uploads/2020/05/112233-365-1.jpg

న్యూఢిల్లీ  : సిబిఎస్‌ఇ పరీక్షల కోసం 15వేల కేంద్రాలు

సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌లో వాయిదాపడిన 10, 12వ తరగతి పరీక్షలను 15,000 సెంటర్లలో నిర్వహించనున్నట్టు కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ తెలిపారు. లాకడౌన్‌ కారణంగా వాయిదా పడిన పరీక్షలను జూలై 1 నుంచి 15 వరకు నిర్వహించాలని సీబీఎస్‌ఈ ఇటీవల నిర్ణయించింది. ఈ మేరకు పరీక్షల షెడ్యూల్‌ను కూడా వెల్లడించింది. అయితే, సీబీఎస్‌ఈ పరీక్షలన్నీ విద్యార్థులు చదువుతున్న స్కూళ్లలోనే జరుగుతాయని, ఇతర ప్రాంతాల్లో పరీక్ష కేంద్రాలు వేయరని మంత్రి రమేశ్‌ పోఖ్రియాల్‌ పేర్కొన్నారు. ఆ లెక్క ప్రకారం దేశవ్యాప్తంగా కేవలం 3,000 సెంటర్లలో పరీక్షలు జరుగాల్సి ఉంది. కానీ, కరోనా విస్తరణ నేపథ్యంలో మూడు వేల సెంటర్లలో పరీక్షలు నిర్వహిస్తే సామాజిక దూరం పాటించడం కష్టమని భావించి తాజా నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు సీబీఎస్‌ఈ పరీక్షల నిర్వహణ కోసం 15 వేల పరీక్ష కేంద్రాలను సిద్ధం చేస్తున్నది.