https://www.prabhanews.com/wp-content/uploads/2020/05/ramaxan.jpg

హైదరాబాద్ : నేడు రంజాన్- ఇళ్లల్లోనే ప్రార్థనలు

నేడు రంజాన్..   కరోనా నేపథ్యంలో  మసీదులకు వెళ్లి ప్రార్థనలు చేసుకోలేని పరిస్థితి. ఒకరినొకరు కలుసుకుని శుభాకాంక్షలు చెప్పుకోలేని పరిస్థితి. ఇళ్లలోనే ఎవరికి వారు ప్రార్థనలు చేసుకోవలసిన పరిస్థితి.   ఇలాంటి పరిస్థితే 112 ఏళ్ల క్రితం హైదరాబాద్‌లో వచ్చింది. అప్పట్లో మూసీ వరదలు నగరాన్ని ముంచెత్తాయి. దీంతో నగరం మొత్తం బోసిపోయింది. అయితే, ఈద్గాలు, మసీదులు తెరుచుకున్నా ఎటువంటి హంగూ, ఆర్భాటాలు లేకుండా ఎవరికి వారు ఇళ్లలోనే పండుగ చేసుకున్నారు. ఇప్పుడు కరోనా లాక్‌డౌన్ నేపథ్యంలో ఇళ్లకే పరిమితమైన ముస్లింలు ఎవరికి వారే ఈదుల్ ఫితర్ ప్రార్థనలు నిర్వహించుకుంటున్నారు.