గుంటూరు : కుటుంబం ఆత్మహత్య
గుంటూరు జిల్లాలో దారుణం జరిగింది. అవమాన భారంతో ఓ కుటుంబం ఆత్మహత్యకు పాల్పడింది. బాపట్ల మండలం మరుప్రోలువారిపాలెంలో ఈ విషాదం చోటుచేసుకుంది. ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు విషం తాగి ఆత్మహత్య చేసుకున్నారు. మృతులను వీరారెడ్డి (40), భార్య రమణమ్మ (38), కుమార్తె పోలేరమ్మ (13)గా గుర్తించారు. దొంగతనం నెపం వెూపారని అవమాన భారంతో వీరు ఆత్మహత్య చేసుకున్నారు. పొలంలో వెూటర్ దొంగతనం చేశాడని గత వారం రోజులుగా వీరారెడ్డి పోలీసు విచారణ ఎదుర్కొంటున్నాడు. పోలీసులు పిలిచి విచారణ చేయడంతో అవమానంగా భావించిన వీరారెడ్డి భార్యీ పిల్లలకు విషమిచ్చి తానూ ఆత్మహత్యకు పాల్పడ్డాడు.