హైదరాబాద్ : ఉన్నత విద్యను అంగడి సరుకు చేస్తారా: మల్లు భట్టివిక్రమార్క
ప్రజలంతా కరోనా ఇబ్బందుల్లో ఉంటే కేసీఆర్ మాత్రం సందట్లో సడెమియాలా వ్యవహరిస్తున్నారన్నారు సీఎల్పీ నేత భట్టి విక్రమార్క. పైవేట్ యూనివర్సిటీలకు అనుమతిస్తూ వాటిని సొంతవారికి కట్టబెట్టారని మండిపడ్డారు. ఈ రోజిక్కడ విలేకరులతో మాట్లాడిన ఆయన, స్వార్థంతోనే సీఎం కేసీఆర్ ఐదు పైవేట్ యూనివర్సిటీలకు అనుమతి ఇచ్చారన్నారు. ప్రభుత్వ యూనివర్సిటీలకు స్టాఫ్‌ని, నిధులని కేటాయించకుండా నిర్వీర్యం చేస్తున్నారని,ఉన్నత విద్యను బజారులో పెట్టి అమ్ముతున్నారని మండిపడ్డారు. మంత్రి మాల్లారెడ్డికి, పల్లా రాజేశ్వర్ రెడ్డికి యూనివర్సిటీలు పెట్టుకునే అధికారం ఇవ్వడం అధికార దుర్వినియోగమే అని భట్టి తెలిపారు.