న్యూఢిల్లీ : భారత్ లో లక్షా 38వేలు దాటిన కరోనా కేసులు- నాలుగువేలు మించిన మరణాలు
భారత్ లో నాలుగో దశ లాక్ డౌన్ కొనసాగుతున్నప్పటికీ కరోనా వ్యాప్తి తీవ్రత ఇసుమంతైనా తగ్గలేదు. దేశంలో ఈ ఉదయానికి కరోనా కేసుల సంఖ్య లక్షా 38 వేలు దాటేసింది. మరణాల సంఖ్య నాలుగు వేలు దాటింది. దేశంలో ఇప్పటి వరకూ కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య లక్షా 38వేల 536కు చేరుకుంది. కరోనా కారణంగా సంభవించిన మరణాల సంఖ్య నాలుగు వేల 24కు పెరిగింది.