https://www.prabhanews.com/wp-content/uploads/2020/05/Untitled-23-copy-16.jpg

‘సోలో బ్రతుకే సో బెటర్’ సాంగ్ రిలీజ్ చేసిన ‘నితిన్’..

సుబ్బు దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘సోలో బ్రతుకే సో బెటర్’. ఈ సినిమాని శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్ఎల్‌పి (SVCC) బ్యానర్‌పై బీవీఎస్ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. తమన్ సంగీతం సమకూరుస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఈ చిత్ర థీమ్ వీడియో అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఇప్పుడు ఈ చిత్రం నుంచి తొలి పాటను విడుదల చేసారు. నో పెళ్ళి అంటూ సాగే పాట‌ని న‌టుడు నితిన్ త‌న ట్విట్ట‌ర్ ద్వారా విడుద‌ల చేశారు. సాంగ్ అద్భుతంగా ఉంద‌ని చెప్పిన నితిన్‌.. నేను చూస్తా ఎన్ని రోజులు ఇలాగే సింగిల్‌గా ఉంటావో,, కొన్ని సార్లు చేసుకోవ‌డంలో టైమ్ గ్యాప్ ఉంటుందేమో కాని చేసుకోవ‌డం ప‌క్కా అంటూ త‌న‌దైన స్టైల్‌లో కామెంట్ చేశాడు నితిన్. నో పెళ్లి అంటూ సాగే ఈ పాట‌లో హీరో సాయిధ‌ర‌మ్ తేజ్ తో పాటు రానా, వ‌రుణ్ తేజ్ కూడా సందడి చేశారు. సాయితేజ్ జోడీగా న‌భా న‌టేష్ న‌టిస్తోంది.