https://www.prabhanews.com/wp-content/uploads/2020/01/images.jpg

నేటి రాశి ప్రభ

సోమవారం 25-5-2020

మేష రాశి
పనులలో ఆటంకాలు. దూర ప్రయాణాలు. అనుకోని ఖర్చులు. బంధువులతో తగాదాలు. ఆలోచనలు కలిసిరావు. బాధ్యతలు పెరుగుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.

వృషభ రాశి
కొత్త విషయాలు గ్రహిస్తారు. నూతన ఉద్యోగ లాభం. కార్యసిద్ధి. పలుకుబడి పెరుగుతుంది. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రుల కలయిక. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూల పరిస్థితి.

మిథున రాశి
శ్రమ ఫలిస్తుంది. వ్యవహారాలలో విజయం. శుభ కార్యాలు నిర్వహిస్తారు. ఆస్తిలాభం. సోదరులతో సఖ్యత. వాహనయోగం. వ్యాపారాలు, ఉద్యోగాలలో మరింత సానుకూలత.

కర్కాటక రాశి
సన్నిహితులు, మిత్రులతో కలహాలు, రుణయత్నాలు. ఇంటాబయటా మీదే పైచేయిగా ఉంటుంది. వ్యాపారాలు లాభసాటిగా ఉంటాయి. ఉద్యోగాలలో పదోన్నతులు రావచ్చు.

సింహ రాశి
మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయాలు సందర్శిస్తారు. పనుల్లో అవాంతరాలు. రుణాలు చేస్తారు. ఉద్యోగయత్నాలు వాయిదా వేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో స్వల్ప చికాకులు.

కన్య రాశి
పరిచయాలు పెరుగుతాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వ్యవహారాలలో విజయం. శుభ కార్యాలు నిర్వహిస్తారు. వ్యాపారాలు వృద్ధి చెందుతాయి. ఉద్యోగాలలో ప్రోత్సాహం.

తుల రాశి
పరిస్థితులు అనుకూలిస్తాయి. సంఘంలో గౌరవం. విలువైన వస్తువులు సేకరిస్తారు. పనులు చకచకా పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో సమస్యలు తీరతాయి. దైవ దర్శనాలు.

వృశ్చిక రాశి
ఆర్థిక ఇబ్బందులు. రుణయత్నాలు. ఆకస్మిక ప్రయాణాలు. ఇంటాబయటా ఒత్తిడులు. ఆధ్యాత్మిక చింతన. వ్యవహారాలు మందగిస్తాయి. వ్యాపారాలు, ఉద్యోగాలు నిరాశాజనకంగా ఉంటాయి.

ధనుస్సు రాశి
ఆర్థిక విషయాలు నిరాశ పరుస్తాయి. చర్చలు సఫలం. కుటుంబంలో శుభ కార్యాలు. వస్తులాభాలు. దైవ దర్శనాలు, ఉద్యోగాలలో పురోగతి కనిపిస్తుంది.

మకర రాశి
కొత్త వ్యక్తుల పరిచయం. శుభ కార్యాలు నిర్వహిస్తారు. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. వ్యాపారాలు, ఉద్యోగాలలో ఎదురులేని పరిస్థితి.

కుంభ రాశి
వ్యయ ప్రయాసలు. బంధువులతో వివాదాలు. శ్రమాధిక్యం. ఉద్యోగయత్నాలు వాయిదా. దూర ప్రయాణాలు. సోదరుల నుంచి ఒత్తిడులు. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొద్దిపాటి చికాకులు.

మీన రాశి
వ్యవహారాలలో విజయం. శుభ వార్తలు వింటారు. వాహనయోగం. స్థిరాస్తి వివాదాల పరిష్కారం. ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు, ఉద్యోగాలలో నూతనోత్సాహం.

– శ్రీమాన్‌ శ్రీమత్తిరుమల గుదిమెళ్ల యతీంద్ర ప్రవణాచార్య సిద్ధాంతి