https://www.prabhanews.com/wp-content/uploads/2020/05/srisailam-1-678x381.jpg

శ్రీశైలంలో మ‌హా కుంభ‌కోణం.. రూ.5 కోట్ల సోమ్ముని స్వాహా చేసిన ఉద్యోగులు..

శ్రీశైలం… శ్రీశైలం మ‌ల్ల‌న్న ఆ ఆల‌య ఉద్యోగులే శ‌ఠ‌గోపం పెట్టారు… భ‌క్తులు వివిధ రూపాల‌లో ఇచ్చిన రూ.5 కోట్ల‌ను స్వాహా చేశారు.. ఈ ఆల‌య ఈవో రామారావు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం అక్రమార్కులు శ్రీఘ్రదర్వనాలు, అభిషేకం టికెట్లు, కంకణాలు, మహా మంగళహారతి టికెట్ల ద్వారా వచ్చిన ఆదాయాన్ని కాజేశారు.. 150 రూపాయల శ్రీఘ్రదర్శనంలో కోటి రూపాయలను, 15 వందల అభిషేకం టికెట్లలో 50 లక్షలను, అకామడేషన్‌లో మరో 50 లక్షలను కాజేశారు. టోల్ గేట్ పెట్రోల్ బంకుల నిర్వహణలో మరో రూ.40 లక్షలు, 500 రూపాయల టిక్కెట్లు, కంకణాలు, మహా మంగళహారతి టికెట్లలో మరో 50 లక్షల రూపాయలు దుర్వినియోగం జరిగింది. దీనికోసం ఏకంగా ఆల‌యంలో ఉప‌యోగిస్తున్న సాఫ్ట్ వేర్ నే మార్చేశారు. అభియోగం తమ మీదికి రాకుండా అక్రమార్కులు టికెట్ కౌంటర్లలో కాంట్రాక్టు ఉద్యోగులను నియమించారని చెబుతున్నారు. ఈ విషయం మీద శ్రీ శైలం ఆలయ ఈవో రామారావు మాట్లాడుతూ భారీ ఎత్తున అవినీతి జరిగింది వాస్తవమేనని అన్నారు. మొత్తం ఎంత జరిగింది అనేదానిపై ఇంకా పూర్తి నివేదిక రాలేదన్న ఆయన రికవరీ చేసే ప్రయత్నంలో ఉన్నామని ఈ విషయం మీద ప్రభుత్వానికి కూడా నివేదిక అంద‌జేయ‌నున్నామ‌ని చెప్పారు.