https://www.prabhanews.com/wp-content/uploads/2020/05/jagan-13.jpg

వ్య‌వ‌స్థ‌లో మార్పు తెచ్చేందుకు అడుగులు వేస్తున్నాంః జ‌గ‌న్

అమరావతి –  రాష్ట్రంలో పార్టీలకతీతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నామని ఏపీ సీఎం జగన్ అన్నారు. కుల, మతాలకు అతీతంగా గ్రామ వాలంటీర్లు పని చేస్తున్నారని పేర్కొన్నారు. వ్యవస్థలో మార్పు తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. ఏడాది పాలనపై ఇవాళ్టి నుంచి జగన్ మేదోమథనం నిర్వహిస్తున్నారు. దీనిలో భాగంగా పరిపాలనా సంస్కరణలు, సంక్షేమంపై సమీక్ష నిర్వహించారు. ఈ సంద‌ర్భం గా జ‌గన్ మాట్లాడుతూ, గ‌డ‌ప వ‌ద్ద‌కే అన్ని సంక్షేమ ప‌థ‌కాలు అందించాల‌నే ప్ర‌య‌త్నంలో భాగంఆ నాలుగు నెలల్లో లక్షా 35 వేల ఉద్యోగాలను ఇచ్చామని తెలిపారు. సంవత్సర కాలంలో 4 లక్షల ఉద్యోగాలు కల్పించామని తెలిపారు. వైఎస్సార్ విద్యా దీవెన కింద రూ.4 వేల కోట్లు కేటాయించామన్నారు. గతంలో పెన్షన్లు 44 లక్షల మందికి ఇచ్చేవారు, అది కూడా వెయ్యి రూపాయలు అన్నారు. చిన్న చిన్న వ్యాపారులు, షాపుల కోసం రూ.10 వేలు ఇవ్వబోతున్నామని చెప్పారు. అక్టోబర్ లో రెండో విడత రైతు భరోసా చేపట్టబోతున్నామని చెప్పారు. ఎక్కడా కూడా బెల్ట్ షాపులు లేకుండా తొలగించామని తెలిపారు. ప్రస్తుతం ప్రభుత్వమే మద్యం షాపులను నడుపుతోందన్నారు. 43 వేల బెల్ట్ షాపులను తొలగించామన్నారు. 4 వేల 380 మద్యంషాపులను తొలగించామని తెలిపారు. తాగకూడదనే మద్యం రేట్లు పెంచామని తెలిపారు. గ్రామ స్థాయికి వైద్యం చేర్చుతున్నామని చెప్పారు. వైఎస్సార్ విలేజ్ క్లినిక్ లో 54 రకాల మందులు, ఏఎన్ ఎం అందుబాటులో ఉంటారని తెలిపారు. రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చేందుకు అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు. జనతా బజార్ లలో రైతులు పండించిన పంటలు అమ్ముకోవచ్చు అన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరగతి పరిశ్రమలను ఆదుకున్నామని తెలిపారు.
అమ్మఒడి, ఇళ్ల పథకం, వైఎస్సార్ భరోసా, వైఎస్సార్ వాహన మిత్ర వంటి పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. లబ్ధిదారుల ఎంపిక పారదర్శకంగా జరుగుతోందన్నారు. వైఎస్సార్ విద్యా దీవెన కింద రూ.4 వేల కోట్లు కేటాయించామని తెలిపారు. ఈ విద్యా సంవ‌త్స‌రం నుంచే ప్ర‌భుత్వ పాఠశాల‌ల్లో ఆంగ్ల మీడియంను ప్ర‌వేశ‌పెట్టేందుకు కృషి చేస్తున్నామ‌ని చెప్పారు. అన్ని పాఠ‌శాల‌ల భ‌వ‌నాల‌ను అధునీక‌రిస్తున్నామ‌ని తెలిపారు.