112 ఏళ్ల తర్వాత తిరిగి ఇంటిలోనే రంజాన్ ప్రార్ధనలు..
హైదరాబాద్ – కరోనా కల్లోలం సృష్టిస్తున్న వేళ ముస్లిం సోదరుల సందడి లేక చారిత్రాత్మక నగరం హైదరాబాద్ వెలవెలబోతోంది. హైదరాబాద్ నగరంలో రంజాన్ సందడే లేకుండా పోయింది. ఆఖరికి ముస్లిం సోదరులు ప్రార్థనలకు మసీదులకు రాకుండా ఇళ్లకే పరిమితమయ్యారు. దీంతో రంజాన్ పండుగ రోజున కూడా హైదరాబాద్ నగరం బోసిపోయింది. కరోనా కారణంగా సామూహిక ప్రార్థనలకు ముస్లింలు దూరమై ఎవరి ఇళ్లలో వారు ప్రార్థనలు చేసుకుంటూ నిరాడంబరంగా పండుగ జరుపుకుంటున్నారు. ఎప్పుడో 112 ఏళ్ల క్రితం మూసీ నదికి వరదలు వచ్చినప్పుడు ఇటువంటి పరిస్థితి ఉంది. మళ్లీ ఇన్నేళ్లకు కాదు కాదు ఇన్ని దశాబ్దాలకు ఇటువంటి పరిస్థితి వచ్చింది. మూసీ నదికి వరదలు వచ్చిన అప్పట్లో మసీదులు తెరిచి ఉంచినప్పటికీ.. ఇళ్లలోనే ప్రార్థనలు చేసుకున్నారు. కాగా చరిత్రను పరిశీలిస్తే 112 ఏళ్ల క్రితం కూడా ముస్లింలు రంజాన్ ను ఇళ్లలోనే ఉండి జరుపుకున్నారు. 1908 సెప్టెంబర్ సెప్టెంబర్ లో మూసీ నదికి భారీగా వరదలు వచ్చాయి. కుండపోత వర్షానికి భారీగా ప్రాణ నష్టం కూడా సంభవించింది. వరద తీవ్రతకు మూసీ నదిపై ఉన్న 3 వంతెనలు సైతం తెగిపోయి..15 వేల మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. వేలాదిగా ఇళ్లు కూలిపోయాయి. వేలదాదిమంది నిరాశ్రయులయ్యారు. సరిగ్గా అదే సమయంలో రంజాన్ మాసం ప్రారంభమైంది. దీంతో నగరం పరిస్థితి దీనాతిదీనంగా ఉండటంతో హైదరాబాదీ ముస్లిం సోదరులు సమన్వయం పాటించారు. నగరం ఇటువంటి పరిస్థితిలో ఉండగా రంజాన్ పండుగను ఆడంరంగా జరుపుకోవటం సరికాదనుకున్నారు. దీంతో ఆనాడు నిరాడంబరంగా రంజాన్ ను జరుపుకున్నారు. మళ్లీ ఇన్నేళ్లకు అంటే 112ఏళ్ల తర్వాత రంజాన్ పండుగ షాపింగ్‌లు..వీధుల్లో హలీమ్ ఘుమఘుమలు లేకుండానే రంజాన్ పండుగను జరుపుకోవాల్సి వచ్చింది. రంజాన్ సీజన్లో జనాలతో కిటకిటలాడే చార్మినార్ ప్రాంతాలు బోసిపోయాయి. మసీదులలో సామూహిక ప్రార్ధనలు కరోనాతో కనిపించలేదు..