https://www.prabhanews.com/wp-content/uploads/2019/10/puvvada-ajay.jpg

ఖమ్మం : వ్యవసాయంలో సంస్కరణల శకం : పువ్వాడ

వ్యవసాయంలో సంస్కరణల శకం ఈ ఏడాది వర్షాకాలంలో ప్రారంభమవు తుందని రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్‌ అన్నారు. వ్యవసాయ రంగం మరింత ప్రగతి సాధించేందుకు ముఖ్యమంత్రి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని  పేర్కొన్నారు. తెలంగాణ వ్యవసాయానికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ దశానిర్దేశం చేస్తున్నారని అన్నారు. తెలంగాణ ఏర్పడిన సమయంలో వ్యవసాయం తీవ్ర సంక్షోభంలో ఉందనీ ఇప్పుడిప్పుడే  రైతాంగంలో నమ్మకం ఏర్పడుతోందని అన్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల్లోని రైతులతో సమవేశమైన మంత్రి  ‌ సమగ్ర పంటల విధానం పై అవగాహన కల్పిస్తున్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు కష్టించి పండించిన పటకు మంచి రేటు రావాలని, ఉత్పిత్తి అంతా సంపూర్ణంగా అమ్ముడుపోయేలా ప్రభుత్వం ప్రయత్నిస్తోందన్నారు. రైతులు పండించిన పంటను నేరుగా ప్రభుత్వమే పూర్తిగా కొనుగోలుచేసేలా వారికి భరోసా కల్పిస్తోందని అన్నారు. ప్రపంచంతో పోటీపడేలా తెలంగాణలో పంటల సాగు జరగాలన్నదే సీఎం కేసీఆర్‌ ఆకాంక్షిస్తు న్నారని తెలిపారు. తెలంగాణ వ్యవసాయ రూపు రేకలు మార్చే విధంగా ప్రజల అవసరాలు, మార్కెట్‌ డిమాండ్‌లకు అనుగుణంగా జరగాల్సిన పంటల సాగుపై అనుసరించాల్సిన విధానాలపై రైతులకు అవగాహన కల్పిస్తున్నారు.