ముంబై : మహా మాజీ సీఎం అశోక్ చవాన్ కు కరోనా
మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి అశోక్ చవాన్ కు కరోనా సోకింది. కాంగ్రెస్ నేత అయిన చవాన్ ప్రస్తుతం ఉద్ధవ్ కేబినెట్‌లో పీడ్ల్యూడీ మంత్రిగా ఉన్నారు. మంత్రి తరచూ ముంబై నుంచి తన స్వగ్రామమైన మరఠ్వాడాకు వెళ్లి వస్తుంటారని తెలుస్తోంది. ఈ క్రమంలోనే ఆయనకు వైరస్ సంక్రమించి ఉంటుందని అనుమానిస్తున్నారు. కొన్ని రోజుల క్రితమే ఆయనకు వైరస్ సోకిందని, ప్రస్తుతం ఆయన చికిత్స తీసుకుంటున్నారని ఓ అధికారి తెలిపారు. కాగా, ఎన్సీపీ నేత, గృహ నిర్మాణ మంత్రి అయిన జితేంద్ర అవద్ కూడా కరోనా సోకడంతో ఆయన రెండు వారాలపాటు ఆసుపత్రిలో చికిత్స తీసుకున్న తర్వాత కోలుకున్నారు. మహారాష్ట్రలో ఆదివారం నాటికి కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 50 వేల మార్కును దాటింది. ాదివారం ఒక్క రోజే 3,041 కేసులు నమోదయ్యాయి. ఒక్క రోజులో ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం మహారాష్ట్రలో ఇదే తొలిసారి.