ఎపిలో మరో 44 కేసులు
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వ్యాప్తి జరుగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో 44 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 2671కి చేరాయి. మొత్తం మరణాల సంఖ్య 56గా ఉంది. రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రుల్లో 767 మంది చికిత్స పొందుతున్నారు. దాదాపు 1848 మంది చికిత్సతో కోలుకోని ఇంటికి వెళ్లిపోయారు.