http://www.prajasakti.com/./mm/20200525//1590388674.airport-2.jpg

పలు విమానాలు రద్దు...ప్రయాణీకుల ఆందోళన

న్యూఢిల్లీ: లాక్‌డౌన్‌ విధింపుతో రెండు నెలల అనంతరం దేశవ్యాప్తంగా ప్రారంభమైన దేశీయ విమాన సర్వీసులపై ప్రయాణీకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. టిక్కెట్లు అమ్మి...షెడ్యూల్‌ ప్రకటించిన కొన్ని విమానాలు రద్దవ్వడంతో ప్రయాణీకులు ఇబ్బందులు పడుతున్నారు. ఢిల్లీ, ముంబయి, బెంగళూర్‌, హైదరాబాద్‌తోపాటు దాదాపు అన్ని విమానాశ్రయాల్లోనై విమానాలు సర్వీసులు కొన్ని రద్దు అయ్యాయి. అయితే రద్దయిన విమాన సర్వీసుల వివరాలను టిక్కెట్లు బుక్‌ చేసుకున్న ప్రయాణీకులకు అందించకపోవడంతో వారంతా ఎయిర్‌పోర్ట్‌లకు చేరుకొని ఇబ్బందులు పడుతున్నారు. లాక్‌డౌన్‌ కన్నా ముందు నడిచిన విమానసర్వీసుల్లో మూడోవంతు సోమవారం నుంచి ప్రారంభమౌతాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. అయితే కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు మాత్రం అన్ని విమానాలు నడపడం సాధ్యం కాదంటూ వ్యతిరేకించాయి. కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన దాని కన్నా కొన్ని విమానాలను మాత్రమే నడిపేందుకు అంగీకరిస్తామని చివరినిమిషంలో తేల్చి చెప్పాయి. దీంతో చాలా విమానాలు రద్దు అయ్యాయి. ఢిల్లీ నుంచి రావాల్సిన, పొవల్సిన 82 విమానాలు రద్దయ్యాయి. బెంగళూర్‌ విమానాశ్రయం నుంచి ఆరు విమనాలు రద్దు అయ్యాయి. హైదరాబాద్‌ శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి కూడా కొన్ని విమనాలు రీషెడ్యూల్‌ అవ్వగా...మరికొన్ని విమనాలు రద్దు అయ్యాయి. ముంబయిలో అయితే రాను 25, పోను 25 విమానాలను మాత్రమే అనుమతిస్తామని ఉద్ధవ్‌ ఠాక్రే ప్రభుత్వం నిర్ణయించింది.