http://www.prajasakti.com/./mm/20200525//1590401441.images.jpg

'మైండ్‌బ్లాక్‌' పాటకు వార్నర్‌ వినూత్న వీడియో

ఆస్ట్రేలియా క్రికెటర్‌, ఐపిఎల్‌లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌ జట్టు కెప్టెన్‌ డేవిడ్‌ వార్నర్‌ మహేష్‌బాబు పాటకు వెరైటీ వీడియో చేసి అభిమానులను ఆశ్చర్యలో ముంచెత్తారు. వరుసగా తెలుగు పాటలను, డైలాగ్‌లను అనుకరిస్తూ.. వార్నర్‌ తన భార్య క్యాండిస్‌తో కలిసి ఈ మధ్య పదే పదే టిక్‌టాక్‌ వీడియోలు చేస్తూ తన ఇన్‌స్టాగ్రామ్‌లోనూ వాటిని పోస్ట్‌ చేస్తున్న సంగతి తెలిసిందే. 'షాడో బ్యాటింగ్‌ చేస్తున్న సమయంలో ఒక్కసారిగా భార్య, పిల్లల మాటలు వినపడగానే' అంటూ బై బై అని ట్వీట్‌ చేశారు. ఇటీవల మహేష్‌బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలోని మైండ్‌ బ్లాక్‌ పాటలో 'వాడిని కొట్టమను డప్పూ' వ్యాఖ్యకు ఈ వీడియోను జోడించారు. వార్నర్‌ బ్యాటింగ్‌ చేస్తూ.. భార్య, పిల్లలు కనిపించగానే ఒక్కసారిగా బ్యాట్‌ను కిందకి దించుతూ అదృశ్యమయ్యారు. ఈ వీడియోను మహేష్‌ అభిమానులు విపరీతంగా ట్రోల్‌ చేస్తున్నారు.