http://www.prajasakti.com/./mm/20200525//1590404530.aims.jpg

అవిభక్త శిశువుల శస్త్ర చికిత్స విజయవంతం

న్యూఢిల్లీ : నడుము భాగంగా అతుక్కుని పుట్టిన కవల శిశువులను ఎయిమ్స్‌ వైద్యులు విజయవంతంగా వేరు చేశారు. కాగా 64 మంది వైద్యులు పాల్గన్న ఈ శస్త్రచికిత్సకు 24 గంటల సమయం పట్టింది. వైద్య రంగంలోనే అత్యంత అరుదైన ఈ ఆపరేషన్‌లో 64 మంది వైద్యులు పాల్గొ‌న్నా‌రు. ఈ ఆపరేషన్‌కు 24 గంటల సమయం పట్టిందని ఎయిమ్స్‌ పీడియాట్రిక్‌ విభాగం ప్రొఫెసర్‌ డాక్టర్‌ మిను బాజ్‌పారు అన్నారు. కాగా, రెండు నెలల వయస్సు నుండి ఆ పిల్లలు తన పర్యవేక్షణలోనే ఉన్నారని, ప్రస్తుతం వారి వయస్సు రెండేళ్లని అన్నారు. శిశువుల వెన్నెముక దగ్గర తగినంతగా చర్మం లేకపోవడంతో గుండె, ప్రధాన రక్తనాళాలకు రక్తప్రసరణ పూర్తిస్థాయిలో లేదని, దీంతో శస్త్రచికిత్స చేసే సమయంలో అత్యంత క్లిష్టమైన పరిస్థితిని ఎదుర్కోవాల్సి వచ్చిందని చెప్పారు.