http://www.prajasakti.com/./mm/20200525//1590418103.KARTHEE.jpg

కార్తీకి శుభాకాంక్షల వెల్లువ

తమిళ సూపర్‌ స్టార్‌ హీరో కార్తీ తెలుగులో కూడా సుపరిచితుడే. ఆయనకు సోషల్‌ మీడియా వేదికగా సోమవారం పుట్టిన రోజు శుభాకాంక్షలు వెల్లువెత్తాయి. ప్రస్తుతం కార్తీ నటిస్తున్న 'సుల్తాన్‌', 'పొన్నియిన్‌ సెల్వన్‌' చిత్రాలు సెట్స్‌ మీద ఉన్నాయి. రష్మిక తొలిసారిగా కార్తీ సరసన తమిళచిత్రం సుల్తాన్‌లో నటిస్తోంది. మణిరత్నం మల్టీస్టారర్‌ మూవీ 'పొన్నియిన్‌ సెల్వన్‌'లో కార్తీ కీలక పాత్ర పోషిస్తున్నాడు. చోళ సామ్రాజ్య నేపథ్యంలో తెరకెక్కిస్తున్న ఈ చారిత్రాత్మక చిత్రంలో మాజీ విశ్వసుందరి ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌, చియాన్‌ విక్రమ్‌, జయం రవి, త్రిష, ఐశ్వర్య లక్ష్మీ, లాల్‌, శోభితా ధూలిపాళి నటిస్తున్నారు. ఈ చారిత్రాత్మక చిత్రం కోసం అభిమానులంతా ఆసక్తిగా ఎదురుచుస్తున్నారు.