అమెరికాలో కరోనా తగ్గుముఖం: ట్రంప్ వెల్లడి
వాషింగ్టన్: గత కొద్ది రోజులుగా అమెరికాలో కరోనా ఉధృతి తగ్గిందని, మొత్తం కేసులు, మరణాల సంఖ్య తగ్గిందని ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేర్కొన్నారు. అమెరికాలో కొత్త నమోదవుతున్న కేసుల సంఖ్య, మరణాల సంఖ్య భారీగా పడిపోయిందన్నారు. దేశంలో కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య లక్షకు చేరవుతున్న తరుణంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనర్హాం. కరోనాతో హాస్పటల్లో చేరుతున్న వారి సంఖ్య సగానికి తగ్గిందని వైట్ హౌస్ అధికారి ఒకరు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. అమెరికాలో ఇప్పటి వరకు 16,77,356 కేసులు నమోదయ్యాయి. వీరిలో 98.024మంది మరణించారు. 3,41,718 మంది కోలుకోగా ఇంకా వివిధ ఆసుపత్రుల్లో 12,37,614 మంది చికిత్స పొందుతున్నారు.