http://www.prajasakti.com/./mm/20200525//1590421460.Les-Amis-de-Cuba-medicos.jpg

క్యూబన్‌ వైద్యులకు నోబెల్‌ శాంతి బహుమతి

ప్రతిపాదనకు పెరుగుతున్న మద్దతు

బ్రస్సెల్స్‌ : కరోనాపై పోరులో అనేక దేశాలకు అండగా నిలిచిన క్యూబన్‌ వైద్యులకు నోబెల్‌ శాంతి బహుమతి ఇవ్వాలన్న ప్రతిపాదనకు మద్దతు అంతకంతకూ పెరుగుతోంది. ఫ్రాన్స్‌, ఇటలీ, స్పెయిన్‌, ఐర్లండ్‌ తదితర దేశాలకు చెందిన ముప్పైకి పైగా సంస్థలతో కూడిన వేదిక చేసిన ఈ ప్రతిపాదనకు తాజాగా బెల్జియన్‌ ఫ్రెండ్స్‌ ఆఫ్‌ క్యూబా అసోసియేషన్‌ మద్దతు పలికింది. అసోసియేషన్‌ ఉపాధ్యక్షుడు ఫ్రెడ్డీ టాక్‌ మీడియాతో మాట్లాడుతూ 2005 నుంచి అనేక దేశాల్లో కోట్లాది మంది ప్రజల్ని రక్షిస్తూ, తాజాగా కొన్ని డజన్ల దేశాల్లో కోవిడ్‌ా19పై పోరాటం చేస్తున్న హెన్రీ రీవీ మెడికల్‌ బ్రిగేడ్‌ క్యూబా)కు నోబెల్‌ పురస్కారం ఇవ్వాలని ప్రతిపాదించింది. 1969 నుంచి ఈ అసోషియేషన్‌ క్యూబాతో కలిసి సంఘీబావ చర్యల్లో పాల్గంటున్నది.. గత 15 ఏళ్లలో ఆఫ్రికా, లాటిన్‌ అమెరికా, కరేబియన్‌, ఆసియా దేశాల్లో భూకంపాలు, తుపానులు, వరదలు, అంటువ్యాధులు ప్రబలిన సమయంలో క్యూబా వైద్యులు నిరుపమానమైన సేవలందించారు. కరోనా వైరస్‌ పై పోరులో యూరప్‌లో ముఖ్యంగా ఇటలీ, అండోరాకు క్యూబా డాక్టర్లు, నర్సులు, ఇతర హెల్త్‌ టెక్నిషియన్లు హుటాహుటిన చేరుకుని వైద్య సేవలందించారు.
క్యూబా వైద్యుల సంఘీభావం, పరోపకారం, నిబద్ధతలకు గుర్తింపుగా నోబెల్‌ శాంతి బహుమతి వారికి ఇవ్వడం ఎంతో సముచితంగా ఉంటుందని బెల్జియన్‌ ఫ్రెండ్స్‌ ఆఫ్‌ క్యూబా అసోసియేషన్‌ పేర్కొంది.