హీరోయిన్ ఏంటి కుక్క బిస్కెట్లు తినడం ఏంటి?

by
https://www.mirchi9.com/wp-content/uploads/2020/02/Nithiin-Reddy-Rashmika-Mandanna-1.jpg

యంగ్ హీరో నితిన్ నటిస్తున్న భీష్మ ఈ నెల 21న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధం అవుతుంది. వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పటివరకు రిలీజైన ప్రమోషనల్ మెటీరియల్ ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ కలిగించాయి. విడుదల దగ్గరపడటంతో నితిన్ ప్రమోషన్స్ జోరు పెంచాడు.

ఇందులో భాగంగా నితిన్ రష్మిక కలిసి ఒక ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ ఇంటర్వ్యూలో యాంకర్ నితిన్ ని రష్మిక గురించి చెప్పమంటే అతను చెప్పిన ఒక విషయం ఆశ్చర్యం కలిగించింది. “సహజంగా మనం అందరం ఆకలి వేస్తే ఫ్రూప్ట్స్, బిస్కెట్స్, చిప్స్, టిఫిన్ వంటివి తింటాం… మరి తాను ఏం తింటాదో తెలుసా,” అని అడిగాడు నితిన్.

ఈ సమయంలో రష్మిక కలగజేసుకుని నితిన్ ఆపడానికి చాలా ట్రై చేసింది. అయితే నితిన్ ఆగకుండా తను కుక్క బిస్కెట్లు తింటుందని చెప్పుకొచ్చాడు. దీనితో యాంకర్ కూడా ఒకింత ఖంగుతిన్నది. అసలు మనుషులు అందులోనూ ఒక హీరోయిన్ కుక్క బిస్కెట్లు తినడం ఏంటో అని అభిమానులు కూడా తలలు పట్టుకున్నారు.

ఇది ఇలా ఉండగా… రష్మిక సంక్రాంతికి విడుదలైన సరిలేరు నీకెవ్వరూ సినిమాతో స్టార్ లీగ్ లో చేరింది. పెద్ద హిట్ కూడా అందుకుంది. ఈ సినిమా కూడా హిట్ కొట్టాలని ఆరాటపడుతుంది. మరో వైపు బన్నీ సుకుమార్ సినిమాలో ఆమె హీరోయిన్ గా నటిస్తుంది. ఈ రెండు సినిమాలు హిట్ అయితే ఇక వెనుతిరిగి చూసుకోనవసరం లేదు.