పదిహేడేళ్ళ క్రితం తప్పుకి ఇప్పటికీ చింతిస్తున్న బాలయ్య డైరెక్టర్

by
https://www.mirchi9.com/wp-content/uploads/2020/02/B-Gopal.jpg

నటరత్న నందమూరి బాలకృష్ణ, సీనియర్ డైరెక్టర్ బి.గోపాల్ కాంబినేషన్‌లో పలు సూపర్‌హిట్ సినిమాలు తెరకెక్కాయి. `లారీ డ్రైవర్`, `సమరసింహారెడ్డి`, `నరసింహనాయుడు` వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాలను వీరు అందించారు. అయితే వీరి కాంబినేషన్‌లో తెరకెక్కిన `పల్నాటి బ్రహ్మనాయుడు` చిత్రం మాత్రం ఘోర పరాజయం చవిచూసింది.

ఆ చిత్రంలోని కొన్ని సీన్లు బాలయ్యకు ఎంతో చెడ్డపేరు తెచ్చిపెట్టాయి. ఆ తరువాత ఆ దర్శకుడు కొన్ని సినిమాలు చేసినా సక్సెస్ చూడలేదు. మరోవైపు అదే దర్శకుడికి బాలయ్య ఇప్పుడు అవకాశం ఇవ్వబోతున్నాడని వార్తలు వస్తున్నాయి. ఈ క్రమంలో బీ. గోపాల్ ఒక మీడియా ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన వ్యాఖ్యలు.

“పల్నాటి బ్రహ్మనాయుడు సినిమా పరాజయానికి పూర్తి బాధ్యత నాదే. ఆ సినిమాలో కొన్ని సీన్లు విమర్శలపాలయ్యాయి. ముఖ్యంగా బాలయ్య తొడకొడితే ట్రైన్ వెనక్కి వెళ్లిపోయే సీన్ సినిమాలో పెట్టకుండా ఉండాల్సింది. ఆ సీన్ గురించి ఇప్పటికీ నేను బాధపడుతుంటాను. ఆ సీన్ పెట్టి చాలా తప్పు చేశాననే ఫీలింగ్ నాకుంది,” అని ఆయన చెప్పుకొచ్చారు

అయితే బీ. గోపాల్ మాత్రం బాలయ్యతో ఇంకో సినిమా మీద క్లారిటీ ఇవ్వలేదు. ఒకవేళ అవకాశం వస్తే గతంలో జరిగిన తప్పుని సవరించుకుంటారేమో చూడాలి. ప్రస్తుతం బాలయ్య తనకు బాగా కలిసొచ్చిన బోయపాటి శ్రీను దర్శకత్వంలో రాబోతున్న సినిమాకు ప్రిపేర్ అవుతున్నారు. ఈ నెలాఖరులో ఆ సినిమా సెట్స్ మీదకు వెళ్తుంది.