
అందుకే దేవుడు బయటపెట్టాడు..!
- డిప్యూటీ సీఎం నారాయణ స్వామి
సాక్షి, అమరావతి: ప్రతిపక్ష నేత చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేష్ ఎంత అవినీతి పరులో తేలిపోయిందని డిప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ... పీఏ ఇంట్లో సోదాలు జరిగితేనే రూ.2 వేల కోట్లు బయటపడ్డాయని.. చంద్రబాబు, లోకేష్ ఇంట్లో సోదాలు చేస్తే లక్షల కోట్లు బయటపడతాయన్నారు. సుజనా , సీఎం రమేష్, నారాయణ, దేవినేని ఉమాలపై కూడా విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.(ఓటుకు నోటు కేసుపై కూడా నిగ్గు తేల్చాలి)
గత ఐదేళ్లలో లక్షల కోట్లు చంద్రబాబు దోచుకున్నారని మండిపడ్డారు. చంద్రబాబు, ఆయన బినామీలపై సీబీఐ,ఈడీ విచారణ జరపాలన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిపై అక్రమ కేసులకు కారణమైన వాళ్లందరికీ ఆ దేవుడు బుద్ధి చెబుతున్నాడని..అందుకే చంద్రబాబు అవినీతిని దేవుడే బయటపెట్టారని నారాయణ స్వామి పేర్కొన్నారు.(రూ. 2 వేల కోట్లు: హైదరాబాద్‌కు చంద్రబాబు పయనం!)