ఏబీ వెంకటేశ్వరరావు విషయంలోనూ ప్రభుత్వానికి ఇబ్బందే

by
https://www.mirchi9.com/wp-content/uploads/2020/02/ab-venkateswara-rao-2.jpg

చంద్రబాబు హయాంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఆర్థిక అభివృద్ధి బోర్డు సీఈఓగా పనిచేసిన జాస్తి కృష్ణ కిషోర్ పై జగన్ ప్రభుత్వం అవినీతి ఆరోపణలు చేస్తున్న సంగతి తెలిసిందే. ఆయన ఆ విషయంగా క్యాట్ ని ఆశ్రయించారు. ఇప్పటిదాకా క్యాట్ విచారణ సందర్భంగా చేసిన వ్యాఖ్యలు రాష్ట్ర ప్రభుత్వానికి ఇబ్బంది కలిగించేవి గానే ఉన్నాయి.

తాజాగా మాజీ ఇంటలిజెన్స్ డీజీ ఏబీ వెంకటేశ్వరరావు కూడా తన సస్పెన్షన్ మీద క్యాట్ ని ఆశ్రయించారు. అయన పిటీషన్ మీద మొదటి రోజు విచారించిన క్యాట్ ప్రాధమికంగా ప్రభుత్వాన్నే తప్పు పట్టడం విశేషం. జీ స్థాయి అధికారిని సెంట్రల్ గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఎలా సస్పెండ్ చేస్తారు..? హోంశాఖకు సమాచారం ఇచ్చారా అని ప్రభుత్వాన్ని క్యాట్ ప్రశ్నించింది.

అయితే స్టేకు నిరాకరించింది. ఆ తరువాత పిటిషన్‌పై విచారణను ఈ నెల 24వ తేదీకి వాయిదా వేసింది. అఖిల భారత సర్వీసు నిబంధనల్ని అతిక్రమించి అవినీతికి పాల్పడ్డారని వెంకటేశ్వరరావుపై సస్పెన్షన్ వేటు వేసింది. వివిధ సంస్థలతో అక్రమ లావాదేవీలకు పాల్పడ్డారని దానికి ప్రాధమికంగా ఆధారాలు ఉన్నాయని ప్రభుత్వం అంటుంది.

ఆయన మాత్రం ఇది రాజకీయ ప్రేరేపితమైన చర్య అని ఆరోపిస్తూ క్యాట్ ని ఆశ్రయించారు. జగన్ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆయనను పదవి నుండి తప్పించి అప్పటి నుండీ పోస్టింగ్ ఇవ్వలేదు. పైగా మే 2019 నుండి జీతం కూడా చెల్లించడం లేదని వెంకటేశ్వరరావు క్యాట్ ని ఆశ్రయించారు.