https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/02/14/Airtel.jpg?itok=fN5xAMKl

రూ.10 వేల కోట్లు కడతాం



సాక్షి,న్యూఢిల్లీ:  సర్దుబాటు చేసిన స్థూల రాబడి (ఏజీఆర్‌)  బకాయిల  చెల్లింపులపై డాట్‌ తాజా ఆదేశాలపై ప్రముఖ టెలికాం  సంస్థ భారతీ ఎయిర్‌టెల్‌ స్పందించింది. ఫిబ్రవరి 20 వ తేదీ నాటికి రూ.10వేల కోట్ల చెల్లిస్తామని తెలిపింది. మిగిలిన బకాయిలను తదుపరి  విచారణ సమయాని కంటే ముందే సర్దుబాటు చేస్తామని వివరించింది.  గౌరవనీయమైన సుప్రీంకోర్టు తీర్పు , అనంతరం టెలికాం విభాగం ఆదేశాలకు అనుగుణంగా, భారతి గ్రూప్ కంపెనీల తరపున 2020 ఫిబ్రవరి 20 నాటికి రూ .10,000 కోట్లు (ఖాతాలో) జమ చేస్తామని ఎయిర్‌టెల్‌ తెలిపింది. ఈ మేరకు డాట్‌ ప్రతినిధి( (ఫైనాన్స్) ఒక లేఖ రాసింది.  లైసెన్స్ ఫీజు, స్పెక్ట్రం వినియోగ ఛార్జీతో సహా దాదాపు రూ .35,586 కోట్లను ఎయిర్‌టెల్  ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంది.

చదవండి :  టెల్కోలకు మరోషాక్‌:  డాట్‌ డెడ్‌లైన్‌