https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/02/14/soudi.jpg?itok=P2lDPFmC
ప్రతీకాత్మక చిత్రం

ఆ మార్పు ప్రేమికులకు వరమైంది

సౌదీ అరేబియాలో రూల్స్‌ను అతిక్రమించిన వారి పరిస్థితి ఎలా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ముఖ్యంగా ఓ జంట పెళ్లికి ముందు ఎలాంటి సంబంధం కొనసాగించినా వారికి దారుణమైన శిక్షలు తప్పవు. బాహాటంగా ప్రేమ పేరెత్తితే చాలు నాలుక తెగ్గోస్తారు. ఇలాంటి నేపథ్యంలో యువత ప్రాణాలకు తెగించి ముందడుగు వేయలేక..  ప్రేమ అనే మధురానుభవాన్ని రుచిచూడలేక అల్లాడిపోయింది. అందుకే ఆన్‌లైన్‌ ప్రేమ బాట పట్టించింది. ట్వీటర్‌, స్నాప్‌ చాట్‌, డేటింగ్‌ యాప్‌ల ద్వారా తమ ప్రేమకు తలుపులు తెరిచారు యువతీ,యువకులు. ప్రేమించుకోవటానికో వేదిక దొరికినందుకు తెగ సంతోష పడిపోయారు. సంబంధాలు వెతికి తమ పిల్లలకు పెళ్లిళ్లు చేసే ఓపిక లేక కొందరు తల్లిదండ్రులు కూడా వీటిని ప్రోత్సహించారు. అయితే ప్రేమించిన వారిని నేరుగా కలుసుకోలేకపోతున్నామన్న బాధ వారిని వేధిస్తుండేది.

అది కూడా నిన్నమొన్నటి వరకు. ప్రస్తుతం సౌదీ ప్రభుత్వం చట్టాల్లో తీసుకొస్తున్న మార్పు ప్రేమికులకు వరంగా మారింది. ఆ మార్పుల్లో భాగంగానే యువజంటలు కేఫ్‌లలో, రెస్టారెంట్లలో కలిసి కూర్చునే అవకాశం కలిగింది. దీనిపై అక్కడి యువత మాట్లాడుతూ... ‘సౌదీ అరేబియాలో ఎర్ర గులాబీలు అమ్మటం డ్రగ్స్‌ అమ్మినంత నేరం.. సంబంధంలేని ఓ యువకుడి పక్కన ఓ యువతి కూర్చుని మాట్లాడం అన్నది ఒకప్పుడు ఊహించుకోవటానికే సాధ్యం కాని విషయం.’’ అని అన్నారు.

https://www.sakshi.com/sites/default/files/article_images/2020/02/14/Sakshi%20World%20of%20Love%20_640x300_2_2.jpg