https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/02/14/amazon.jpg?itok=_tUBfHti

ఈ-కామర్స్‌ సంస్థలకు భారీ ఊరట



సాక్షి, బెంగళూరు: ఆన్‌లైన్‌ దిగ్గజం అమెజాన్‌కు  కర్నాటక హైకోర్టులో భారీ ఊరట లభించింది. యాంటీ ట్రస్ట్‌ విచారణపై  అమెజాన్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన కోర్టు, అమెజాన్‌, ఇతర ప్రముఖ ఇ-కామర్స్ కంపెనీలపై  దర్యాప్తును శుక్రవారం కోర్టు నిలిపివేసింది.  రాయిటర్స్‌ కథనం ప్రకారం సీసీఐ దర్యాప్తును రెండు నెలల పాటు వాయిదావేసినట్టుగా న్యాయవాదులు  వెల్లడించారు. దీంతో  దేశంలోని ఈ కామర్స్‌ సంస్థలకు భారీ ఉపశమం లభించింది.

కాంపిటీషన్‌ చట్టాలను ఉల్లంఘిస్తూ అక్రమాలకు పాల్పడుతున్నారన్న ఆరోపణలపై కాంపిటిషన్‌‌ కమిషన్‌‌ ఆఫ్‌‌ ఇండియా (సీసీఐ) దర్యాప్తు ఆదేశాలపై  కోర్టు స్టే విధించింది. 13 జనవరి 2020 న సీసీఐ జారీ చేసిన ఆదేశాలను నిలిపివేయాలంటూ అమెజాన్‌ కర్నాటక హైకోర్టును ఆశ్రయించింది. న్యాయ ప్రయోజనాల దృష్ట్యా, వాస్తవాలు, పరిస్థితుల ఆధారంగా తమకు ఉపశమనం కల్పించాలని కోర్టును అభ్యర్థించిన సంగతి తెలిసిందే.  మరి తాజా పరిణామంపై దేశీయ చిన్న  వ్యాపార సం‍స్థలు  ఎలా  స్పందించనున్నాయో చూడాలి. 

చదవండి : ఉపశమనం కల్పించండి - అమెజాన్‌ 
భారత్‌కు ఉపకారమేమీ చేయడం లేదు.. 
ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లపై సీసీఐ దర్యాప్తు