https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/02/14/22.jpg?itok=Ft2jK6hh

నూరు గొడ్లు తిన్న రాబందు ఒక్క గాలి వానకు..

సాక్షి, విజయవాడ : ప్రతి రోజు మీడియాతో మాట్లాడే చంద్రబాబు ఇప్పుడెందుకు నోరు విప్పడం లేదని వ్యవసాయశాఖ మంత్రి కురసాల కన్నబాబు ప్రశ్నించారు. శుక్రవారం విజయవాడలో మంత్రి మాట్లాడుతూ.. పీఎస్‌పై సోదాలు చేస్తేనే రూ.2 వేల కోట్లు తేలిందని, చంద్రబాబు, లోకేష్‌లపై సోదాలు జరిపితే ఎన్ని లక్షల  కోట్లు తెలుతుందో అని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. చంద్రబాబు ఎంత దోచుకున్నారో ఐటీ సోదాలు బట్టి తేలిపోయిందని, ఆయన అవినీతి, రాష్ట్రానికి జరిగిన నష్టం ఇప్పుడు ప్రజలకు తెలిసిపోయిందన్నారు.  చంద్రబాబు, లోకేష్ లపై కూడా ఐటీ సోదాలు జరపాలని సూచించారు.

కృష్ణా:  నూరు గొడ్డులు తిన్న రాబందు ఒక గాలి వానకు కూలినట్లు ఇన్నాళ్లకు చంద్రబాబు పాపం పండిందని రాష్ట్ర రవాణా, సమాచారశాఖ మంత్రి పేర్ని నాని ధ్వజమెత్తారు. ఇది ఇక్కడితో ఆగదు, చంద్రబాబు అవినీతి చిట్టా బయటపడే రోజు దగ్గరలోనే ఉందని స్పష్టం చేశారు. తన పలుకుబడితో అవినీతి కేసులకు స్టేలు తెచ్చుకున్న చంద్రబాబు ఇన్నాళ్లకు అడ్డంగా దొరికిపోయారని వ్యాఖ్యానించారు.

తిరుపతి : గత నాలుగు రోజులుగా జరుగుతున్న ఐటీ దాడుల్లో చంద్రబాబు నాయుడు బినామీల అక్రమ ఆస్తులు  వెలుగు చూశాయని పరిశ్రమల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రరెడ్డి స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేస్తున్న అభివృద్ధిని ఓర్వలేక తప్పుడు ప్రచారం చేసే ఎల్లో మీడియాకి ఐటీ దాడులు కనిపించడం లేదా అని ప్రశ్నించారు. 2 వేలకోట్లు బయటపడ్డ కళ్లకు గంతలు కట్టినట్టు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ఇంత జరుగుతున్న చంద్రబాబు ఒక్కమాట కూడా బయట పడటం లేదని, ఆయనకు ఎలాంటి సంబంధం లేకుంటే ఎందుకు ఐటీ దాడులపై స్పందించడం లేదని ప్రశ్నించారు. ప్రశ్నిస్తామని వచ్చిన పవన్ కళ్యాణ్ ,కాంగ్రెస్ నాయకులు కూడా నోరు మెదపడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.

శ్రీకాకుళం : చంద్రబాబు కమీషన్‌ల బాగోతం బట్టబయలు అయిందని మంత్రి ధర్మాన కృష్ణ దాస్ అన్నారు. జిల్లాలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... గతంలో సీబీఐ విచారణలు వద్దన్నది ఇందుకేనా అని ప్రశ్నించారు. అవినీతి జరిగిందని అరోపణలు వచ్చినప్పుడు విచారణ ఎదుర్కోవాలని హితవు పలికారు. ప్రజలు అవినీతిని సహించడం లేదని, పారదర్శకమైన పాలన కోరుకుంటున్నారన్నారు. నాలగైదు చోట్ల దాడులకే రెండు వేల కోట్లు బయటపడ్డాయని, ఇంకా దాడులు చేయాల్సి ఉందని అన్నారు. *చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్‌లు ఐటీ దాడుల మీద స్పందించాలని పిలుపునిచ్చారు.