https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/02/14/sensex.jpg?itok=fV7xN19n

 సుప్రీం షాక్‌, గరిష్టంనుంచి 500 పాయింట్లు పతనం

సాక్షి, ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు లాభాలనుంచి అనూహ్యంగా నష్టాల్లోకి జారి బలహీనంగా కొనసాగుతున్నాయి. ఏజీఆర్‌ చెల్లింపుల విషయంపై సుప్రీం కోర్టును ఆశ్రయించిన టెలికాం కంపెనీలకు చుక్కెదురు కావడంతో మార్కెట్లో అనూహ్య అమ్మకాలు వెల్లువెత్తాయి.  ఇన్వెస్టర్ల అమ్మకాలుకొనసాగుతున్నాయి. దీంతో సెన్సెక్స్‌ ఇంట్రాడే గరిష్టం నుంచి ఏకంగా 519 పాయింట్లు, నిఫ్టీ ఇంట్రాడే హై నుంచి 148 పాయింట్లను కోల్పోయాయి.  మిడ్‌ సెషన్‌ అనంతరం పుంజుకుని, సెన్సెక్స్‌ 110 పాయింట్లు క్షీణించి 41344 వద్ద,  నిఫ్టీ 35 పాయింట్లు పతనమైన 12140 వద్ద  కొనసాగుతున్నాయి.  అయితే  ఇంకా  లాభనష్టాల మధ్య తీవ్ర ఊగిసలాట ధోరణి కొనసాగుతోంది. వారాంతంలో చివరి గంట  ట్రేడింగ్‌ కీలకం.

ప్రధానంగా బ్యాంకుల, టెలికాం సెక్టార్‌ నష్టాలు  ప్రభావితం చేస్తున్నాయి. ఫలితంగా ఒక్క ఐటీ షేర్లు తప్ప మిగిలిన అన్ని రంగాల షేర్లు నష్టపోతున్నాయి. అయితే భారతి ఎయిర్‌ టెల్‌ మాత్రం లాభాల్లో కొనసాగుతోంది. వోడాఫోన్‌ ఐడియా ఏకంగా 17శాతం కుదేలైంది. ఐడియా, అవెన్యూ సూపర్‌మార్కెట్స్‌, భారతి ఇన్‌ఫ్రాటెల్‌, గెయిల్‌  తదితరాలు నష్టపోతున్నాయి.  యస్‌ బ్యాంకు, యూపీఎల్‌, బీపీసీఎల్‌, రిలయన్స్‌, హెచ్‌సీఎల్‌ టెక్‌, ఐసీఐసీఐ బ్యాంకు లాభపడుతున్నాయి.