https://ajnews.andhrajyothy.com/AJNewsImages//2020//Jan//20200131//Hyderabad//637160902266067665.jpg

జీవాల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది- తలసాని

హైదరాబాద్‌: జీవాల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటుందని పశుసంవర్ధకశాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా చేపట్టనున్న పశువులకు గాలికుంటువ్యాధి నివారణ టీకాల పంపిణీ కార్యక్రమాన్ని ఫిబ్రవరి 1వ తేదీన యదాద్రి జిల్లా రాజాజేట మండలం రఘునాధపూర్‌లో మంత్రి తలసాని ప్రభుత్వ విప్‌ గొంగిడి సునీతతో కలలిసి ప్రారంభించనున్నారు. జీవాలు రోగాల బారిన పడకుండా ప్రతి సంవత్సరం అనేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టుపేర్కొన్నారు. అందులో భాగంగానే పశువులలో గాలికుంటు వ్యాధి నివారణకు టీకాలు వేయడం, గొర్రెలకు నట్టల నివారణ కోసం డీవార్మింగ్‌ కార్యక్రమం చేపట్టి రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో నిర్వహిస్తామన్నారు. రాష్ట్రంలో ఉన్న 84 లక్షల పశువులకు ఈ టీకాలను వేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటున్నట్టు వివరించారు. ఫిబ్రవరి 1న ప్రారంభించే టీకాల పంపిణీ కార్యక్రమం నెలరోజుల పాటు కొనసాగుతుందని మంత్రి తెలిపారు. ఇప్పటికే రైతులకు అవగాహన కల్పించేందుకు పోస్టర్లు, కరపత్రాల ద్వారా గ్రామాల్లో విస్తృత ప్రచారం కల్పించామన్నారు.