సమ్మక్క-సారలమ్మ వద్దకు సైకిల్‌యాత్ర పోస్టర్ ఆవిష్కరణ
హైదరాబాద్: తెలంగాణ సంక్షేమంతో పాటు సమ్మక్క-సారలమ్మ పై తనకున్న అఖండ భక్తి శ్రద్దల కారణంగా అమ్మవార్లజాతర జరిగే మేడారం వద్దకు సైకియల్ యాత్ర చేస్తున్నట్టు సీనియర్‌జర్నలిస్టు, సంత్‌స్వామి మహరాజ్ పొన్నాల గౌరీశంకర్ తెలిపారు. ఈమేరకు తన యాత్రకు సంబంధించిన పోస్టర్‌ను తెలంగాణ ప్రభుత్వ పత్రిక సంపాదకులు అష్టకాల రామ్మోహన్, సమాచార పౌరసంబంధాల శాఖ డైరెక్టర్ నాగయ్యకాంబ్లీ, అసిస్టెంట్ డైరెక్టర్ హష్మీ వేర్వేరుగా ఆవిష్కరించారు. హైదరాబాద్‌కు సుమారు 300 కి.మీ. దూరం మేడారంలో కొలువైన సమ్మక్క- సారలమ్మజాతరకు సైకిల్ యాత్రచేస్తున్నట్టు ఆయన తెలిపారు. తెలంగాణ సాకారమైతే సైకిల్‌పై వచ్చి దర్శనం చేసుకుంటానని వన దేవతలకు మొక్కుకున్నట్టుఆయన తెలిపారు. మొక్కు తీర్చుకోవడంలో భాగంగానే ఈ సైకిల్‌యాత్ర చేపట్టినట్టు తెలిపారు. తాను ఇప్పటి వరకూ దేశంలోని 710 జిల్లాల్లో ప్రాచీన దేవాలయాలను సందర్శించినట్టు తెలిపారు. సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన పలు సంక్షేమ పధకాలను ఆయా ప్రాంతాల్లో ప్రచారంచేసినట్టు పేర్కొన్నారు. తెలంగాణకు హరితహారం పై ప్రచారం కోసం కూడా సైకిల్‌యాత్ర చేసినట్టు గౌరీశంకర్ స్వామి వెల్లడించారు. ప్రతి గ్రామంలో వంద మొక్కలు నాటించి పర్యావరణ పరిరక్షణకు తన వంతు కృషి చేసినట్టు వెల్లడించారు.