రైతులు నూతన పద్ధతిలో వ్యవసాయం చేయాలి: దత్తాత్రేయ
మెదక్: రైతులు నూతన పద్ధతిలో వ్యవసాయం చేయాలని హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ దత్తాత్రేయ చెప్పారు. కౌడిపల్లి మండలం తునికిలో కృషివిజ్ఞాన కేంద్రాన్ని దత్తాత్రేయ సందర్శించారు. సేంద్రీయ ఎరువులతో వ్యయసాయం చేస్తే బంగారు తెలంగాణ సాధ్యమన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు వస్తే ఆత్మహత్యలు ఉండవన్నారు. హిమాచల్‌ప్రదేశ్‌లో గోవుల సంరక్షణ కోసం రూ. 25 వేలు ఇస్తున్నామని దత్తాత్రేయ తెలిపారు.