
మందడం రైతులకు సంఘీభావం తెలిపిన వైసీపీ ఎంపీ
అమరావతి: మందడంలో రైతులు చేస్తున్న దీక్షకు వైసీపీ ఎంపీ కృష్ణదేవరాయలు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. భూములిచ్చిన ఎవరికీ అన్యాయం జరగదని స్పష్టం చేశారు. ప్రభుత్వ కమిటీ వచ్చినప్పుడు అందరూ అభిప్రాయం చెప్పాలని సూచించారు. రైతుల కష్టాలు తమకు తెలుసని ఆయన వ్యాఖ్యానించారు. ఇదిలా ఉంటే.. అమరావతిని కొనసాగిస్తామంటేనే తమతో చర్చకు రావాలని రైతులు డిమాండ్ చేశారు. ‘రాజధానికి అనుకూలమా? కాదా?’ చెప్పాలని నినాదాలు చేశారు.