అక్రమకట్టడాలపై ఉక్కుపాదం మోపుతాం: అవంతి

విశాఖ: అక్రమకట్టడాలపై ఉక్కుపాదం మోపుతామని మంత్రి అవంతి శ్రీనివాస్ తెలిపారు. విశాఖ అభివృద్ధికి మాస్టర్ ప్లాన్‌ రూపొందిస్తున్నామన్నారు. కరోనా వైరస్ వ్యాపించకుండా అధికారులు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. విశాఖ బ్రాండ్ ఇమేజ్ పెంచేందుకు టీడీపీతో సహా అందరూ సహకరించాలని కోరారు. విశాఖలో కొత్త పార్క్‌లు, బీచ్‌లు అభివృద్ధి చేస్తామని అవంతి శ్రీనివాస్ చెప్పారు.