https://ajnews.andhrajyothy.com/AJNewsImages//2020//Jan//20200131//Hyderabad//637160808601825450.jpg

ఒక భాషలో మాట్లాడితే ఇంకో భాషలో టైప్ అవుతుంది!

వాయిస్ టు టెక్స్ట్ అనేది ఇప్పుడు మనలో చాలామంది ఉపయోగించే సౌకర్యం. మనం మాట్లాడిన మాటల్ని గూగుల్ ట్రాన్స్‌లేట్ ( Google Translate ) వెంటనే గుర్తించి కావలసిన భాషలోకి మార్చి అందిస్తుంది. అయితే గూగుల్ ట్రాన్స్‌లేట్‌లో త్వరలో మరో కొత్త ఫీచర్ రాబోతోంది. అది ఏమిటంటే - మనం ఒక భాషలో ఆడియో అందించినా అది వేరే భాషలో టెక్స్ట్ గా ఇచ్చే సదుపాయం!

 

ఇప్పటివరకూ మనం ఏ భాషలో మాట్లాడితే - అది అదే భాషలో టెక్స్ట్ గా మాత్రమే లభించే అవకాశం ఉంది. అయితే ఇప్పుడు మాట్లాడిన వెంటనే - టార్గెట్‌ లాంగ్వేజ్‌ని వేరేగా సెలక్ట్‌ చేసుకుంటే - అదే విషయాన్ని అప్పటికప్పుడు అనువదించి, అక్కడికక్కడే కోరిన భాషలో టెక్స్ట్‌గా పొందే అవకాశం ఏర్పడుతోంది.

 

అయితే ఈ కొత్త సౌకర్యం లైవ్ రికార్డింగ్ వరకే పరిమితం. అంతేగానీ ముందే రికార్డు చేసిన ఆడియో ని ప్లే చేసి - ఇలా మరో భాషలో కన్వర్టెడ్‌ టెక్స్ట్‌గా పొందలేం. ఏదేమైనా ఇది గొప్ప సౌకర్యం అని ఒప్పుకోక తప్పదు. కాబట్టి ఇకపై మీరు ఒక భాషలో మాట్లాడి మరో భాషలో ఆ టెక్స్ట్‌ను వెంటనే పొందే వీలుంది.