మాకు, ప్రతిపక్షాలకు పనిలేకుండా పోయింది: కేటీఆర్
హైదరాబాద్: గతంలో సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీలు నెరవేరడంతో తమకు, ప్రతిపక్షాలకు పనిలేకుండా పోయిందని మంత్రి కేటీఆర్ చెప్పారు. టీఎస్ ఐపాస్ ద్వారా మంచి మార్పులు వచ్చాయన్నారు. ముఖ్యమంత్రి విజన్ దేశానికి ఉపయోగపడటం సంతోషమన్నారు. టీఎస్ బిపాస్ విధానాన్ని తీసుకు వస్తామని, ఎలాంటి అవినీతి లేకుండా భవన అనుమతులు ఇస్తామని తెలిపారు. పుర పాలన, పరిపాలన మీదే ఇకపై తాము దృష్టి సారిస్తామన్నారు. రియల్‌ఎస్టేట్ వ్యాపారులు హైదరాబాద్‌లో కాకుండా.. ఇతర జిల్లాల్లో కూడా పెట్టుబడులు పెట్టాలని కేటీఆర్ సూచించారు. 10 రోజుల్లో జేబీఎస్ నుంచి సీబీఎస్‌కు మెట్రో లైన్ కేసీఆర్ ప్రారంభిస్తారని తెలిపారు. ఫిబ్రవరి, మార్చిలో మరికొన్ని కంపెనీలు వస్తున్నాయని, కోంపల్లిలో ఐటీ పార్క్ రాబోతోందని తెలిపారు. టీడీఆర్ బ్యాంక్‌ను త్వరలోనే ప్రారంభిస్తామని కేటీఆర్ ప్రకటించారు.