https://www.sakshi.com/sites/default/files/styles/storypage_main/public/article_images/2020/01/31/Coronavirus.jpg?itok=pSwmbl1S

హైదరాబాద్‌లో పెరుగుతున్న ‘కరోనా’ అనుమానితులు

సాక్షి, హైదరాబాద్‌ : ప్రపంచాన్ని వణికిసోస్తున్న ప్రాణాంతక కరోనా వైరస్‌ అనుమానితుల సంఖ్య హైదరాబాద్‌లో రోజురోజుకు పెరుగుతుంది. నగరంలోని గాంధీ హాస్పిటల్‌లో ఇద్దరు, ఫీవర్‌ ఆస్పత్రిలో నలుగురు కరోనా వైరస్‌ అనుమానితులు చేరారు. ఇప్పటివరకు హైదరాబాద్‌లో 15 కరోనా అనుమానిత కేసులు నమోదయ్యాయి. ఇప్పటికే పుణె ల్యాబ్‌కు పంపిన 11 శాంపిల్స్‌లో 9 మందికి నెగిటివ్‌ రిపోర్ట్‌ వచ్చిందని.. మరో ఇద్దరి రిపోర్ట్‌ రావాల్సి ఉందని అధికారులు వెల్లడించారు. 

గాంధీ ఆస్పత్రిలో కరోనా వైరస్‌ నిర్ధారణ పరీక్షలు నిర్వహించేందుకు కేంద్రం అనుమతిచ్చిన సంగతి తెలిసిందే. ఈ మేరకు కరోనా నిర్దారణ వైద్య కిట్స్‌ గాంధీ ఆస్పత్రికి చేరాయి. దీంతో వైద్యులు గాంధీ ఆస్పత్రిలో ట్రయల్‌ టెస్టులు ప్రారంభించారు. రెండు మూడు రోజుల్లోనే గాంధీలో పూర్తి స్థాయిలో కరోనా వైరస్‌ నిర్ధారణ టెస్టులు చేపడతామని వైద్యులు తెలిపారు. 

చదవండి : కరోనాపై పోరాటానికి 103 కోట్లు విరాళం

నిర్మానుష్య వీధిలో శవం.. భయం వేస్తోంది

చైనా నుంచి వచ్చే విద్యార్థుల కోసం..