త్రిసూల్ సిమెంట్ కంపెనీ లీజు రద్దు
సాక్షి, అనంతపురం : జిల్లాలోని యాడికిలో మెస్సర్స్ త్రిసూల్ సిమెంట్ కంపెనీ లీజును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రద్దు చేసింది. కొనుప్పలపాడులో 649.86 హెకార్ట సున్నపురాతి గనుల లీజు రద్దు చేస్తున్నట్టు ఉత్తర్వులు జారీచేసింది. అలాగే సిమెంట్ తయారీ ప్లాంట్ నిర్మాణానికి.. మరో ఐదేళ్ల పొడిగింపు ఉత్తర్వులను ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. ప్లాంట్ నిర్మాణానికి సంబంధించి ఎలాంటి ముందడుగు పడనందునే లీజు రద్దు చేస్తున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. లీజు ప్రాంతం నుంచి 38 వేల 212 మెట్రిక్ టన్నుల సున్నపురాయి నిక్షేపాన్ని అక్రమంగా తవ్వి తీయడం, రవాణా చేయడంపై విచారణ కొనసాగుతుందని ఏపీ ప్రభుత్వం స్పష్టం చేసింది.