అపుడు దోసానామిక్స్, ఇపుడు థాలినామిక్స్
- 2006-2020 మధ్య వెజిటేరియన్ థాలి రేటులో 29 శాతం పెరుగుదల
- నాన్ వెజిటేరియన్ థాలిలో 18 శాతం పెరుగుదల
సాక్షి, న్యూఢిల్లీ: ఎకనామిక్ సర్వే 2019-20లో ముఖ్య ఆర్థిక సలహాదారు కృష్ణమూర్తి సుబ్రమణియన్ తన గురువు, ఆర్‌బీఐ మాజీ గవర్నరు రఘురామ రాజన్ ఫాలో అయ్యారు. గతంలో రాఘురామ రాజన్ దోసానిమిక్స్ (2016 బడ్జెట్ , ద్రవ్యోల్బణం, అధిక వడ్డీరేట్లు)లో ద్రవ్యోల్బణం సైలెంట్ కిల్లర్ అని చెబితే.. తాజాగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్‌బీ) లో మాజీ అసోసియేట్ ప్రొఫెసర్ కేవీ సుబ్రమణియన్ నేతృత్వంలోని కమిటీ రూపొందించిన ఆర్థిక సర్వేలో థాలినోమిక్స్ డిన్నర్ టేబుల్‌పై ఆహారం ఆర్థికశాస్త్రం ఎలా ప్రభావితం చేస్తుందో తెలియచెప్పడానికి ప్రయత్నించింది. గత13 ఏళ్లలో వెజిటేరియన్-నాన్‌వెజిటేరియన్ కొనుగోలు శక్తి ఎంత పెరిగిందో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంటులో ప్రవేశపెట్టిన సర్వేలో వివరించారు
'థాలినామిక్స్: ది ఎకనమిక్స్ ఆఫ్ ఏ ప్లేట్ ఆఫ్ ఫుడ్ ఇన్ ఇండియా' పేరుతో దీనిని ఆర్థిక సర్వేలో ప్రత్యేకంగా పేర్కొంది. దీని ఆధారంగా పై కొనుగోలు శక్తిని తెలిపింది. 25 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని సుమారు 80 కేంద్రాల్లో వినియోగదారుల ధరల సూచిక నుండి వచ్చిన డేటాను ‘థాలి’ ఖర్చుతో ఏప్రిల్ 2006 నుంచి అక్టోబర్ 2019 మధ్య కొనుగోలు వివరాలను ఈ సర్వే విశ్లేషించింది.
భారతదేశం అంతటా ఒక థాలి (ఒక భోజనం) కోసం ఒక సాధారణ వ్యక్తి చెల్లించే మొత్తాన్ని లెక్కించే ప్రయత్నమని ఎకనామిక్ సర్వే పేర్కొంది. థాలి రేట్ల ఆధారంగా ఆర్థిక రంగంలో నెలకొన్న ఒడిదుడుకులపై అంచనా వేస్తూ 2006-07 నుంచి 2019-20 మధ్య వెజిటేరియన్ థాలి రేటులో 29 శాతం పెరుగుదల, నాన్ వెజిటేరియన్ థాలిలో 18 శాతం పెరుగుదల నమోదయినట్లు ఈ సర్వే పేర్కొంది. ఈ సర్వే ప్రకారం రోజుకు రెండుసార్లు వెజిటేరియన్ థాలీ తీసుకునే ఐదుగురు వ్యక్తులు కలిగిన ఓ కుటుంబం ఏడాదిలో సగటున రూ.10,887 సంపాదిస్తోందనీ, నాన్ వెజిటేరియన్ కుటుంబం రూ.11,787గా ఉందని పేర్కొంది. సగటున పారిశ్రామిక కార్మికుడి వార్షిక ఆదాయాన్ని బట్టి చూస్తే 2006-07 నుంచి 2019-20 మధ్య శాఖాహార థాలి కొనుగోలు శక్తి 29 శాతం, మాంసాహార థాలి శక్తి 18 శాతం మెరుగుపడింది. వెజిటేరియన్ థాలిలో తృణధాన్యాలు, సబ్జీ, పప్పు వడ్డిస్తారు. నాన్ వెజిటేరియన్ థాలీలో తృణధాన్యాలు, సబ్జీ, మాంసాహారం వడ్డిస్తారు. భారత్‌లోని నాలుగు ప్రాంతాలు... ఉత్తరం, దక్షిణం, తూర్పు, పడమర ప్రాంతాల్లో 2015-16 నుంచి వెజిటేరియన్ థాలీ ధరలు క్రమంగా తగ్గాయి. కానీ 2019లో మాత్రం పెరిగాయి. ఇటీవలికాలంలో భోజనం ధరను తెలుసుకోవడానికి సర్వే ప్రయత్నించడం ఇదే మొదటిసారి.